ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించండి | - | Sakshi
Sakshi News home page

ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించండి

Jun 12 2026 12:11 AM | Updated on Jun 12 2026 12:11 AM

కూసుమంచి: వర్షపాతం తక్కువగా నమోదవుతుందనే సూచనలు ఉన్నందున చివరి ఆయకట్టు రైతులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారి డి.పుల్లయ్య సూచించారు. మండలంలోని నేలపట్లలో గురువారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రైతులు నీటి వసతి ఆధారంగా పంటల సాగు చేపట్టాలని, ప్రస్తుతం పెసర, మినుము, అపరాల సాగు లాభదాయకమని తెలిపారు. భూగర్భ జలాలు తగ్గినప్పుడు రైతులు అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు చేస్తే దిగుబడి పెరుగుతుందని, వరిలో కూడా వెదజల్లే పద్ధతి అనుసరించాలని సూచించారు. అనంతరం కూసుమంచిలోని పలు విత్తన దుకాణాలను టాస్క్‌ఫోర్స్‌ బృందంతో కలిసి డీఏఓ తనిఖీ చేశారు. సర్పంచ్‌ శోభన్‌బాబు, ఏడీఏ సతీష్‌, ఏఓ వాణి, జల వనరుల శాఖ ఏఈ నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement