30లోగా కమిటీల నియామకం పూర్తి | - | Sakshi
Sakshi News home page

30లోగా కమిటీల నియామకం పూర్తి

Jun 11 2026 8:11 AM | Updated on Jun 11 2026 8:11 AM

ఖమ్మంమయూరిసెంటర్‌: ఎస్‌ఐఆర్‌ పరిశీలన కోసం బూత్‌, గ్రామ, మండల, పట్టణ కమిటీల నియామకానికి ఈనెల 30లోగా పూర్తి చేయాలని డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్‌ సూచించారు. ఖమ్మంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే మండలాలకు ఇన్‌చార్జిలను నియమించిన నేపథ్యా వారు ఎమ్మెల్యేల ఆమోదంతో కమిటీలను నియమించాలని తెలిపారు. కాగా, ఈనెల 15న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని తీర్మానం చేసినట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో పార్టీ, అనుబంధ సంఘాల నాయకులు వడ్డేబోయిన నర్సింహారావు, సూరంశెట్టి నాగభూషణం, పులిపాటి వెంకయ్య, కొత్తా సీతారాములు, దొబ్బల సౌజన్య, వేజెండ్ల సాయికుమార్‌, మొక్క శేఖర్‌గౌడ్‌, బొడ్డు బొందయ్య, కాపా మురళీకృష్ణ, పుచ్చకాయల వీరభద్రం, గజ్జెల్లి వెంకన్న, బండారు నరసింహారావు, మట్టూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

డీసీసీ అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement