ఎన్‌సీసీలో గురుకుల విద్యార్థినుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

ఎన్‌సీసీలో గురుకుల విద్యార్థినుల ప్రతిభ

Jun 9 2026 8:28 AM | Updated on Jun 9 2026 8:28 AM

కొణిజర్ల: కొణిజర్ల మండలం తనికెళ్లలోని గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థినులు ఎన్‌సీసీ సర్టిఫికెట్‌ పరీక్షలో ప్రఽతిభ కనబరిచారు. ఇటీవల జరిగిన ఎన్‌సీసీ ‘బీ’ సర్టిఫికెట్‌ పరీక్షలకు కళాశాల నుంచి 38 మంది బాలికలు హాజరు కాగా అందరూ ఉత్తీర్ణత సాఽధించారు. వీరిలో 20 మంది ‘ఏ’ గ్రేడ్‌ సాధించగా, 18 మంది ‘బీ’ గ్రేడ్‌ సాధించారు. విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపాల్‌ కె.రజని, వైస్‌ ప్రిన్సిపాల్‌ బి.రాజేశ్వరి, ఎన్‌సీసీ కేర్‌ టేకర్‌ కె.హేమభార్గవి అభినందించారు.

ఫర్టిలైజర్‌ షాపుల్లో

డీఏఓ తనిఖీ

వైరా: వైరా మున్సిపాలిటీతో పాటు మండలంలోని పలు విత్తన దుకాణాల్లో టాస్క్‌ఫోర్స్‌ బృందంతో కలిసి జిల్లా వ్యవసాయ శాఖాధికారి డి.పుల్లయ్య సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విత్తనాల నిల్వలను పరిశీలించడంతో ప్రతీ అమ్మకంపై పూర్తి వివరాలతో రశీదు ఇవ్వాలని నిర్వాహకులకు సూచించారు. అంతేకాక ప్రత్యామ్నాయ పంటల సాగు, నానో యూరి యా వినియోగంపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. కాగా, రైతులు ఆధీకృత డీలర్ల వద్దే విత్తనాలు కొనుగోలు చేసి పంట కాలం పూర్తయ్యే వరకు రశీదు భద్రపర్చుకోవాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులు ఎదురైనా ఇబ్బంది రాకుండా కంది, పెసర, మినుము సాగు చేయాలని తెలిపారు. టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ పవన్‌కుమార్‌, ఏఓ మయాన్‌ మంజుఖాన్‌, ఏఈఓ రాజేష్‌ పాల్గొన్నారు.

2.94 క్వింటాళ్ల

గంజాయి దహనం

తల్లాడ: జిల్లాలోని వివిధ ఎకై ్సజ్‌ స్టేషన్ల పరిధిలో స్వాధీనం చేసుకున్న 2.94 క్వింటాళ్ల గంజాయిని సోమవారం తల్లాడ మండలం గోపాలపేటలోని వ్యర్థాల నివారణ ఫ్యాక్టరీలో దహనం చేశారు. రాష్ట్ర పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ నిబంధనల మేరకు గంజాయిని దహనం చేశామని అధికారులు వెల్లడించారు. జిల్లా ఎకై ్సజ్‌ ప్రొహిబిషన్‌ అధికారి జి.నాగేందర్‌రెడ్డి, సూపరింటెండెంట్‌ వేణుగోపాల్‌, ఇన్‌స్పెక్టర్‌ మమతారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement