నిరుద్యోగులకు స్వయం ఉపాధి శిక్షణ | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు స్వయం ఉపాధి శిక్షణ

Jun 9 2026 8:28 AM | Updated on Jun 9 2026 8:28 AM

భద్రాచలం: గిరిజన యువత స్వయం ఉపాధి పొందేలా 25 కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు భద్రాచలం ఐటీడీఏ ఏపీఓ జనరల్‌ డేవిడ్‌ రాజ్‌ తెలిపారు. భద్రాచలంలోని కార్యాయం నుంచి సోమవారం ఆయన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల ఎంపీడీఓలతో టెలీ కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా డేవిడ్‌రాజ్‌ మాట్లాడుతూ నిరుద్యోగ యువత 2,500 మందికి 90 రోజులపాటు శిక్షణ అందించనున్నట్లు తెలిపారు. ఆపై స్వయం ఉపాధి సాధించేలా ముద్ర రుణాలు ఇప్పించనున్నట్లు చెప్పారు. భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లెందు, ఖమ్మం మండలాల్లో ఈనెల 15నుంచి శిక్షణ ఇవ్వనుండగా, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు వారి పరిధిలోని నిరుద్యోగ యువతను గుర్తించి 12వ తేదీలోగా జాబితా పంపించాలని సూచించారు.

టీజీ టీ–20లో కారేపల్లి యువకుడు

వరంగల్‌ వారియర్స్‌ జట్టుకు

దివిన్‌ ఎంపిక

కారేపల్లి: తెలంగాణ క్రికెట్‌ అసోసియేషన్‌(హెచ్‌సీఏ) నిర్వహిస్తున్న టీ–20 లీగ్‌ క్రికెట్‌ టోర్నీకి కారేపల్లి మండల క్రికెటర్‌ ఎంపికయ్యాడు. తాజాగా నిర్వహించిన వేలంలో కారేపల్లి మండలం సూర్యతండా గ్రామానికి చెందిన ఆంగోతు కై లా–కవిత దంపతుల పెద్ద కుమారుడు ఆంగోతు దివిన్‌ను వరంగల్‌ వారియర్స్‌ జట్టు రూ.85 వేలకు కొనుగోలు చేసింది. ఇదేజట్టులో భారత జట్టు ఆటగాడు మహమ్మద్‌ సిరాజ్‌ కూడా ఉండడం విశేషం. కాగా, దివిన్‌ ప్రస్తుతం హనుమకొండలోని వాగ్దేవి కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. రైట్‌హ్యాండ్‌ బ్యాట్స్‌మెన్‌, వికెట్‌ కీపర్‌ అయిన ఆయన అండర్‌–19, 23 కేటగిరీల్లో జిల్లా జట్టు తరఫున ఆడి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. కాగా, దివిన్‌ తండ్రి కై లా చాతకొండ బెటాలియన్‌లో హెడ్‌కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.

భద్రాచలం ఆస్పత్రి

ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా రాజశేఖర్‌రెడ్డి

భద్రాచలంఅర్బన్‌: భద్రాచలం ఏరియా ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా రాజశేఖర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమన్వయ అధికారి(డీసీహెచ్‌ఎస్‌) రవిబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న రామకృష్ణ మణుగూరు ఏరియా ఆస్పత్రికి బదిలీ కావడంతో ఆర్‌ఎంఓగా ఉన్న రాజశేఖర్‌రెడ్డికి ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. అయితే, త్వరలోనే పూర్తిస్థాయి సూపరింటెండెంట్‌గా రాజశేఖర్‌రెడ్డి, ఆర్‌ఎంఓ–1గా సంతోష్‌ నియమితులయ్యే అవకాశముందని సమాచారం.

గ్రామపంచాయతీలను అభివృద్ధి చేసుకోవాలి

పంచాయతీరాజ్‌ డిప్యూటీ కమిషనర్‌ విద్యాలత

చింతకాని: ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులతో గ్రామాల్లో ప్రాధాన్యత క్రమాన పనులు చేపడుతూ అభివృద్ధి చేసుకోవాలని పంచాయతీరాజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ విద్యాలత సూచించారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా సోమవారం మండలంలోని నేరడలో నిర్వహించిన గ్రామసభలో ఆమె మాట్లాడారు. అర్ములకు ఇందిరమ్మ ఇళ్లు, ఫించన్లు మంజూరు చేసేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంన్నారు. అనంతరం ఈజీఎస్‌ నిధులు రూ.10 లక్షలతో గ్రామంలో నిర్మించే సీ్త్ర శక్తి భవనానికి ఆమె శంకుస్థాపన చేశారు. అలాగే ఉన్నత పాఠశాలలో మొక్కలు నాటారు. సర్పంచ్‌ దూసరి నేతాజీ, జెడ్పీ డిప్యూటీ సీఈఓ శ్రీనివాస్‌, ఎంపీడీఓ చుంచు శ్రీనివాసరావు, ఎంపీఓ పర్వీన్‌ ఖైసర్‌, ఏఈ రఘు, ఆర్‌ఐ శ్రీనివాస్‌, గ్రామపంచాయతీ కార్యదర్శి అర్జున్‌ తదితరులు పాల్గొన్నారు.

ఓటర్ల సవరణలో

లోపాలు గుర్తించాలి

కారేపల్లి: ప్రత్యేక ఓటర్ల సవరణను పకడ్బందీగా చేపడుతూ అందులో తప్పులను 10వ తేదీలోగా గుర్తించాలని ఖమ్మం జిల్లా అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ ఆదేశించారు. మండలంలోని గాదెపాడులో ఓటర్ల జాబితా మ్యాపింగ్‌ను సోమవారం ఆమె పరిశీలించారు. మ్యాపింగ్‌ వివరాలు తెలుసుకున్నాక ఆమె ఉద్యోగులకు సూచనలు చేశారు. తహసీల్దార్‌ ఓరుగంటి వెంకటేశ్వర్లు, సర్పంచ్‌ భూక్యా రంజిత్‌కుమార్‌, ఆర్‌ఐ జగదీష్‌, జీపీఓ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement