మద్యం తరలిస్తున్న ఇద్దరి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

మద్యం తరలిస్తున్న ఇద్దరి అరెస్టు

Jun 13 2026 7:38 AM | Updated on Jun 13 2026 7:38 AM

ఐ.పోలవరం: యానాం నుంచి అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎకై ్సజ్‌ అధికారులు పట్టుకున్నారు. ఎదుర్లంక ఎకై ్సజ్‌ చెక్‌పోస్ట్‌ వద్ద అక్రమంగా మద్యం తరలిస్తున్న కారును ఎకై ్సజ్‌ అధికారులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎకై ్సజ్‌ అధికారి ఆదేశాల మేరకు నిర్వహించిన తనిఖీల్లో యానాం నుంచి అక్రమంగా తరలిస్తున్న 500 మిల్లీలీటర్ల 54 టిన్‌ బీర్లను స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం రామవరప్పాడు గ్రామానికి చెందిన దాకరపు లీలాశివరాం, బంటుమిల్లి మండలం ముంజులూరు గ్రామానికి చెందిన గాడే రాజేష్‌ కుమార్‌లను అరెస్టు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎదుర్లంక చెక్‌పోస్ట్‌ సీఐ చంద్రశేఖర్‌ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement