మామిడికుదురు ప్రభుత్వ బాలుర వసతి గృహంలో సమస్యలు వెక్కిరిస్తున్నాయి. 68 మంది విద్యార్థులకు ఆసరాగా ఉన్న ఇక్కడి గదుల్లోని కిటికీలు, తలుపుల మెస్‌లు పాడయ్యాయి. ట్యూబ్ లైట్లు కిందకు వేలాడుతున్నాయి. ఐదు బాత్రూమ్‌లు, ఐదు లెట్రిన్లకు నీటి సరఫరా జరగడం లేదు. మరో 12 బాత్రూమ్‌లు, మరో 12 లెట్రిన్ల పనులు అసంపూర్తిగా ఉన్నాయి. ఈ సమస్యలపై ఏఎస్ డబ్ల్యూఓ ఎస్.సత్యనారాయణ దృష్టికి ‘సాక్షి’ తీసుకువెళ్లగా సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు.
–మామిడికుదురు
అసంపూర్తిగా ఉన్న లెట్రిన్, బాత్రూమ్‌లు
బాలుర హాస్టల్‌లో వేలాడుతున్న ట్యూబ్‌లైట్


