కాకినాడ క్రైం: ఏమైందో ఏమో.. ప్రియుడి ఇంటి వద్ద ఓ బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. కంపా లాఫీ (17) అనే బాలిక తల్లిదండ్రులు పీతా నాగదేవి, కంపా బంగారయ్యలు విడిపోయి కుమార్తెను స్థానిక తారకరామ నగర్‌లో పిన్ని జయవాణి వద్ద వదిలేసి వెళ్లిపోయారు. మూడేళ్ల క్రితం నరసింహ రోడ్డుకు చెందిన తన వయసున్న బాలుడితో లాఫీకి పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం పిన్ని, బాబాయ్‌లకు తెలియడంతో వారు మందలించారు. మనస్తాపం చెందిన బాలిక ప్రియుడి ఇంటికి వెళ్లిపోయింది. కొద్ది నెలలుగా అక్కడే ఉంటోంది. ఏసీ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న ఆ బాలుడితో పాటు అతని తల్లి లోవలక్ష్మి ఓ టైలరింగ్ షాప్‌లో, తండ్రి శివకుమార్‌రాజు దుస్తుల దుకాణంలో పనిచేస్తున్నాడు. వీరితో పాటే లాఫీ నివసిస్తోంది. గురువారం రాత్రి శివకుమార్‌రాజు ఇంటికి వచ్చి చూసేసరికి అప్పటికి కుమారుడు, భార్య ఇంటికి చేరలేదు. లాఫీ ఇంట్లో ఉండడంతో తలుపు కొట్టాడు. ఎంతకీ తీయకపోవడంతో అనుమానం వచ్చి వంట గది కిటికీ లోంచి చూస్తే ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని లాఫీ వేలాడుతోంది. కంగారు పడిన శివకుమార్‌రాజు స్థానికుల సాయంతో తలుపులు తెరిచి చూసేసరికి బాలిక అచేతనంగా ఉంది. ఆమెను జీజీహెచ్‌కు తరలించాడు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. లాఫీ మృతికి ఆ బాలుడితో పాటు అతడి తల్లిదండ్రులు, మరో వ్యక్తి కారణమని బాబాయ్, పిన్ని ఆరోపించారు. మృతురాలి బాబాయ్ నూకరాజు ఫిర్యాదుతో కాకినాడ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
బాలికల అదృశ్యం
పెరవలి (కొవ్వూరు): తండ్రి మందలించాడని ఇద్దరు కుమార్తెలు అర్ధరాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. నేటికీ ఇంటికి రాకపోవడంతో ఆ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ సీఐ విశ్వం కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి ఇద్దరి కుమార్తెలు. వారి వ్యవహార శైలి బాగోలేదని 11న కుమార్తెలను మందలించాడు. మనస్తాపం చెందిన వారు ఆ రోజు రాత్రి ఇంటి బయటకు వెళ్లిపోయారు.
ఫ ప్రియుడి ఇంటి వద్ద బాలిక ఆత్మహత్య
ఫ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు


