పిఠాపురం: నమ్మి ఓట్లు వేశాం, అధికారంలోకి వచ్చాక మమ్మల్ని నట్టేట ముంచారు అంటూ చంద్రబాబు ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెన్నుపోటుపై తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు మాజీ మంత్రి వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో శుక్రవారం వైఎస్సార్ సీపీ శ్రేణులు, ప్రజలు జిల్లాలో భారీ ర్యాలీలు, ప్రదర్శనలతో కదం తొక్కారు. మండుటెండను సైతం లెక్క చేయకుండా భారీగా తరలివచ్చిన జనం ర్యాలీల్లో పాల్గొన్నారు. దీంతో అన్ని నియోజకవర్గాల కేంద్రాలు జనమయంగా మారాయి. ముఖ్యంగా తమకు కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందని, తమకు రక్షణ లేకుండా పోయిందంటూ మహిళలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో జిల్లా మారుమోగింది. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం వివిధ వర్గాలను మోసగించిన తీరును ఎండగట్టారు.
పెద్దాపురం
వైఎస్సార్ సీపీ పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు ఆధ్వర్యంలో పెద్దాపురం అంబేడ్కర్ కమ్యూనిటీ హాల్ నుంచి మెయిన్‌రోడ్ మీదుగా వేంకటేశ్వరస్వామి ఆలయం వరకు పాదయాత్ర జరిగింది. ఈ పాదయాత్రలో నియోజకవర్గంలో నుంచి అధిక సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పార్టీ శ్రేణులు తరలిరావడంతో మెయిన్ రోడ్డు వైఎస్సార్ సీపీ జెండాలు, బెలూన్లతో నిండిపోయింది.
కదం తొక్కిన వైఎస్సార్ సీపీ శ్రేణులు, ప్రజలు
చంద్రబాబు సర్కారు మోసాలపై
ర్యాలీలు, ప్రదర్శనలు
భారీగా తరలివచ్చిన
వివిధ వర్గాల జనం, మహిళలు


