శనివారం శ్రీ 13 శ్రీ జూన్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శనివారం శ్రీ 13 శ్రీ జూన్‌ శ్రీ 2026

Jun 13 2026 7:26 AM | Updated on Jun 13 2026 7:26 AM

తుని

మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో స్థానిక రాజా కళాశాల మైదానం నుంచి ఆంజనేయస్వామి గుడి, బాలాజీ సెంటర్‌, మెయిన్‌ రోడ్డు మీదుగా గొల్ల అప్పారావు సెంటర్‌ వరకు ర్యాలీ సాగింది. రెండేళ్ల కాలంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ప్ల కార్డులు చేతబట్టి నినాదాలు చేశారు. తుని, తొండంగి, కోటనందూరు మండలాలతో పాటు తుని పట్టణానికి చెందిన సుమారు పదివేల మంది ర్యాలీలో పాల్గొన్నారు. పట్టణంలోని ప్రధాన రహదారులు జనంతో నిండిపోయాయి. వైఎస్సార్‌ సీపీ తుని, తొండంగి, కోటనందూరు, తుని పట్టణ పార్టీ అధ్యక్షులు డి నాగేశ్వరరావు, బత్తుల వీరబాబు, చింతకాయల చిన్నబాబు, మున్సిపల్‌ వింగ్‌ రాష్ట్ర కార్యదర్శి రేలంగి రమణ గౌడ్‌, అనుబంధ విభాగాల నాయకులు బోడపాటి సతీష్‌, బి ఉమారావు, ఎంపీపీ లగుడు శ్రీనివాస్‌, పోతల రమణ, హేమంత్‌, నాగేంద్ర నెహ్రూ, నాగం దొరబాబు, సీహెచ్‌ రాంబాబు రాజు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement