పిఠాపురం | - | Sakshi
Sakshi News home page

పిఠాపురం

Jun 13 2026 7:26 AM | Updated on Jun 13 2026 7:26 AM

వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి వంగా గీత ఆధ్వర్యంలో పిఠాపురం పార్టీ కార్యాలయం నుంచి పాదయాత్రగా భారీ ర్యాలీగా బయలుదేరిన వైఎస్సార్‌ సీపీ శ్రేణులు రాజుగారికోట నుంచి కోటగుమ్మం సెంటర్‌, పెద్ద బజారు, చర్చి సెంటర్‌, రామా టాకీస్‌ సెంటర్‌, స్టేట్‌బ్యాంకు సెంటర్‌, వన్‌ వే రోడ్డు, స్టూవర్టుపేట మీదుగా ఉప్పాడ సెంటర్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి పాదయాత్రగా అంబేడ్కర్‌ సెంటర్‌కు చేరుకుని అంబేద్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేసి నివాళులర్పించి ర్యాలీ నుద్దేశించి వంగా గీత మాట్లాడారు. జెడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు, పార్టీ ఎస్‌ఈసీ సభ్యులు రావు చిన్నారావు, గండేపల్లి బాబీ, జిల్లా మహిళా అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, రాష్ట్ర నాయకులు మాదిరెడ్డి దొరబాబు, ఉలవల భూషణం, వడిశెట్టి నారాయణరెడ్డి, మొగలి అయ్యారావు, జ్యోతుల భీముడు, కారే శ్రీనివాసరావు, జడ్పీటీసీ ఉలవకాయల నాగ లోవరాజు, గండ్రేటి రామచంద్రమూర్తి నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement