కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి, ఉమ్మడి విజయనగరం, విశాఖపట్నం జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. వైద్యనగర్‌లోని క్యాంపు కార్యాలయం వద్ద ప్రారంభమైన బైక్ ర్యాలీ నాగమల్లితోట జంక్షన్, ఆశ్రమం పబ్లిక్ స్కూల్, బోట్‌క్లబ్ మీదుగా సర్పవరం జంక్షన్‌కు చేరుకుంది. అక్కడ రోడ్డుపై కన్నబాబు పార్టీ నాయకులు బైఠాయించి చంద్రబాబు వెన్నుపోటుపై నిరసన వ్యక్తం చేశారు. మ్యానిఫెస్టో ప్రతులను దహనం చేసి చంద్రబాబు మోసాలను తెలియజేశారు. కాకినాడ రూరల్ జెడ్పీటీసీ సభ్యుడు నురుకుర్తి రామకృష్ణ. వైఎస్సార్ సీపీ ఎస్‌ఈసీ సభ్యులు సత్యనారాయణ, గోపిశెట్టి బాబ్జి, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, పబ్బినీడి పాపారావు, చింతా ఈశ్వరరావు పాల్గొన్నారు.


