● హైలెస్సో.. హైలెస్సా | - | Sakshi
Sakshi News home page

● హైలెస్సో.. హైలెస్సా

Jun 12 2026 12:11 AM | Updated on Jun 12 2026 12:11 AM

అలల కెరటాల్లో బతుకు పోరాటానికి ఎదురెళ్లారు.. బోట్లపై పోటాపోటీగా ముందుకు సాగారు.. కొన్ని రోజులుగా నిశ్శబ్దంగా ఉన్న సాగర తలాన్ని బోట్లతో హోరెత్తించారు. చేపల వేట నిషేధం పూర్తి కావడంతో వందల బోట్లు ఒకేసారి కడలి వైపు సాగాయి. ఉప్పాడ, కోనపాపపేట, అమీనాబాద్‌, మూలపేట సమీపం నుంచి సముద్రమంతా బోట్లతో సందడిగా మారింది. హైలెస్సో హైలెస్సా అంటూ మత్స్యకారులు వలలు లాగుతూ మత్స్య సంపదను చాలా కాలం తర్వాత కళ్లారా చూసి సంబరపడ్డారు. బుధవారం ఉదయం వేటకు ఉపక్రమించిన వారు.. గురువారం జోరుగా వేట సాగించారు. రాత్రి వేళ లైట్లు వేసి మరీ వేట సాగించారు.

– పిఠాపురం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement