పిఠాపురం: ఎన్నికల్లో అనేక హామీలిచ్చి, అధికారంలోకి వచ్చిన తరువాత చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిన తీరును నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యాన శుక్రవారం జిల్లావ్యాప్తంగా భారీ నిరసన ర్యాలీలు నిర్వహించనున్నారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు, ఈ కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ముఖ్య కేంద్రాల్లో ఆయా కో ఆర్డినేటర్ల ఆధ్వర్యాన నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే నిరసన ర్యాలీలకు జనం భారీగా తరలిరానున్నారు. వీటిని విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


