రేపటి నుంచి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్‌ పోటీలు

Jun 11 2026 7:35 AM | Updated on Jun 11 2026 7:35 AM

అన్నవరం: రత్నగిరిపై బుధవారం భక్తుల రద్దీ నెలకొంది. వేసవి సెలవులు త్వరలో ముగియనుండడంతో సత్యదేవుని దర్శనానికి పెద్ద సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు వచ్చారు. వీరికి సాధారణ భక్తులు కూడా తోడయ్యారు. సుమారు 30 వేల మంది భక్తులు స్వామివారి సన్నిధికి రావడంతో క్యూలు, వ్రత మండపాలు, ఆలయ ప్రాంగణం కిటకిటలాడాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, అంతరాలయ దర్శనానికి అరగంట పట్టింది. రెండు వేల వ్రతాలు జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. సుమారు ఐదు వేల మంది సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు.

సామర్లకోట: పెద్దాపురం రామారావుపేటలోని శ్రీప్రకాష్‌ సినర్జీ స్కూల్‌లో శుక్రవారం నుంచి ఆదివారం వరకూ రాష్ట్ర స్థాయి టేబుల్‌ టెన్నిస్‌ ర్యాకింగ్‌ టోర్నమెంట్‌ నిర్వహిస్తున్నారు. ఆ పాఠశాల డైరెక్టర్‌, ఆంధ్రప్రదేశ్‌ టేబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ చైర్మన్‌ సీహెచ్‌ విజయ ప్రకాష్‌ బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీలకు రాష్ట్ర అసోసియేషన్‌లో నమోదైన క్రీడాకారులు మాత్రమే అర్హులన్నారు. కాకినాడ టెబుల్‌ టెన్నిస్‌ అసోసియేషన్‌ పర్యవేక్షణలో.. బాల, బాలికల విభాగాల్లో అండర్‌–11, 13, 15, 17, 19 కేటగిరీల్లో పోటీలు జరుగుతాయని వివరించారు.

మిగిలిన సీట్ల భర్తీకి

దరఖాస్తుల ఆహ్వానం

తుని రూరల్‌: హంసవరంలోని ఏపీ మోడల్‌ స్కూల్‌లో 2026–27 విద్యా సంవత్సరానికి గాను వివిధ తరగతుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రిన్సిపాల్‌ కె.ధర్మకుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. 6, 7, 8, 9, ఇంటర్‌ ఫస్టియర్‌లో ప్రవేశాలకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 20వ తేదీ లోగా ఆన్‌లైలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆరు నుంచి తొమ్మిది తరగతుల్లో ప్రవేశాలకు ఈ నెల 24న పాఠశాల స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. 25న ఎంపికలు, 26న సర్టిఫికెట్ల పరిశీలన, అడ్మిషన్లు కల్పిస్తామని, వివరాలకు పాఠశాల పని వేళల్లో సంప్రదించాలని ధర్మకుమార్‌ సూచించారు.

ఎదురెదురుగా ఢీకొన్న

మోటార్‌ సైకిళ్లు

ఒకరి మృతి

గండేపల్లి: ఎదురెదురుగా వస్తున్న మోటార్‌ సైకిళ్లు ఢీకొని ఒకరు మృతి చెందారు. ఎస్సై యూవీ శివనాగబాబు కథనం ప్రకారం.. గండేపల్లికి చెందిన కట్టుమోతు శ్రీను (52) బుధవారం మోటార్‌ సైకిల్‌పై సింగరంపాలెం వైపు వెళ్తున్నాడు. గ్రామంలోని దుర్గమ్మ ఆలయం ఎదురుగా వచ్చేసరికి అదే మార్గంలో ఎదురుగా వస్తున్న మరో మోటార్‌ సైకిల్‌ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శ్రీను అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

రత్నగిరిపై భక్తుల రద్దీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement