ప్రకటనలకే పరిమితం | - | Sakshi
Sakshi News home page

ప్రకటనలకే పరిమితం

Jun 10 2026 1:01 AM | Updated on Jun 10 2026 1:01 AM

ఈ ఏడాది మే 15వ తేదీకే పంట కాలువలకు సాగునీరు వదులుతామని, ఖరీఫ్‌ ముందస్తు సాగుకు సిద్ధం కావాలని వ్యవసాయ అధికారులు హడావుడి చేశారు. నిజమే అనుకుని విత్తనాలు సిద్ధం చేసుకున్నాం. కాలువలు తవ్వుతున్నారంటూ రెండు వారాలు ఆలస్యంగా మే 31న సాగునీరు వదిలారు. కరప మండలంలోని పొలాలన్నీ కాలువలకు శివారున, సముద్ర తీరానికి దగ్గరలో ఉంటాయి. వదిలిన నీరు కాస్తా పొలాలకు వచ్చేసరికి మరో 10 రోజులు ఆలస్యమైంది. మడిలోకి నీరు మళ్లించి, దమ్ము చేసి, విత్తనాలు జల్లుకుని, నారుమడి పెంచడానికే నెల రోజులు పట్టేస్తుంది. వ్యవసాయ అధికారులు జూలై నెలాఖరుకల్లా వరి నాట్లు పూర్తి చేయమంటున్నారు. కానీ, నారు పెంచి, నాట్లు వేయడానికి ఆగస్టు నెలకు కానీ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ముందస్తు సాగు ప్రకటనలకే పరిమితమైంది. ఆచరణలో కనబడటం లేదు.

– నున్న వెంకటేశ్వరరావు, రైతు,

విజయరాయుడుపాలెం, కరప మండలం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement