నిందితుడిపై పీడీ యాక్ట్‌ | - | Sakshi
Sakshi News home page

నిందితుడిపై పీడీ యాక్ట్‌

Jun 10 2026 1:01 AM | Updated on Jun 10 2026 1:01 AM

సీతానగరం: బొబ్బిల్లంకకు చెందిన సోడదాసి సీతారామరాజు (పండు) (32)పై పీడీ యాక్ట్‌ అమలు చేస్తున్నామని కోరు కొండ సీఐ ఎస్‌వీవీఎస్‌ మూర్తి అన్నారు. ఈ మేరకు మంగళవారం సీతానగరం పోలీస్‌ స్టేషన్‌లో ఎస్సై బి.వినయ్‌ ప్రతాప్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. సీఐ మూర్తి మాట్లాడుతూ సీతారామరాజుపై ఐదు క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయని, బొబ్బిల్లంక జంట హత్యల కేసులో ఇతడు ప్రధాన నిందితుడన్నారు. గతంలో మర్డర్‌, గంజాయి, పోక్సో, కొట్లాట కేసులతో పాటు ప్రభుత్వ ఉద్యోగిపై దాడి కేసులు ఉన్నాయన్నారు. జంట హత్య కేసులో అరెస్ట్‌ చేయబడి, న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్‌కు పంపించామన్నారు. కేసు విచారణలో భాగంగా నిందితుడి ప్రవర్తన.. ప్రజల్లో భయాందోళనలు సృష్టించడంతో పాటు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నట్లు గుర్తించామన్నారు. వాటిని పరిగణనలోకి తీసుకుని పీడీ యాక్ట్‌ అమలు ప్రతిపాదనలు పంపించగా, కలెక్టర్‌, జిల్లా మెజిస్ట్రేట్‌ పీడీ నిర్బంధ ఉత్తర్వులు జారీ చేశారన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement