● పడుతూ.. లేస్తూ.. | - | Sakshi
Sakshi News home page

● పడుతూ.. లేస్తూ..

Jun 10 2026 1:01 AM | Updated on Jun 10 2026 1:01 AM

అడ్డతీగల – ఏలేశ్వరం ప్రధాన రోడ్డులో అధ్వానంగా మారింది. దీనిలోని గోతుల్లో వర్షం కురిసినప్పుడు నీరు చేరడంతో రాకపోకలకు వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ 11 కిలోమీటర్ల రోడ్డుకు రూ.22 కోట్లు మంజూరై, మూడేళ్లు గడుస్తున్నా పూర్తిస్థాయిలో పనులు నిర్వహించడంలో ఆర్‌అండ్‌బీ అధికారులు చేతులెత్తేస్తున్నారు. గత జనవరిలో అనేక ప్రజా ఉద్యమాల నడుమ తిరిగి పనులు ప్రారంభించినా కొద్ది మేర సీసీ రోడ్డు, మరి కొద్ది ప్రాంతంలో బీటీ రోడ్డు వేసి మిన్నకున్నారు. అదేమేటంటే సంబంధిత కాంట్రాక్టర్‌కు పార్టు బిల్లు కూడా ప్రభుత్వం నుంచి రాలేదని, దీంతో పనులు ఆపేసివెళ్లిపోయాడని చెబుతున్నారు.

– అడ్డతీగల

సరదాగా కాసేపు

విపరీతంగా కాస్తున్న ఎండలకు ప్రజలతో పాటు శునకాలూ బెంబేలెత్తిపోతున్నాయి. చల్లదనం కోసం పరితపించిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మలికిపురం మండలం కేశనపల్లి బీచ్‌లో మంగళవారం ఇసుకలో ఇలా సేదతీరాయి. ఇసుకలో పడుకుని కాసేపు కునుకు తీశాయి. సముద్రపు గాలిని ఆస్వాదించాయి.

– మలికిపురం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement