కడియం: మాధవరాయుడుపాలెం పంచాయతీ పరిధిలోని చైతన్యనగర్ సమీపంలో రూ.50 లక్షల విలువైన గోల్డెన్ బేంబూ పంట కాలిపోయింది. బుర్రిలంక గ్రామానికి చెందిన ఈశ్వరా ఫాండ్ అండ్ నర్సరీ అధినేత తాడాల విష్ణుచక్రవర్తి భార్య రాజరాజేశ్వరికి చెందిన 4.99 ఎకరాల్లో ఈ పంటను సాగు చేస్తున్నారు. అయితే సోమవారం సంభవించిన అగ్ని ప్రమాదంలో మొత్తం పంట ఆగ్నికి ఆహుతైందని చక్రవర్తి వివరించారు. స్థానికులు అప్రమత్తమై రాజమహేంద్రవరం అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో వారితో పాటు, స్థానిక పేపరు మిల్లుకు చెందిన ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపు చేశాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు.


