సత్యదేవుని సన్నిధికి భక్తుల పాదయాత్ర | - | Sakshi
Sakshi News home page

సత్యదేవుని సన్నిధికి భక్తుల పాదయాత్ర

Jun 10 2026 1:01 AM | Updated on Jun 10 2026 1:01 AM

అన్నవరం: జంగారెడ్డిగూడేనికి చెందిన శ్రీరామ ఆధ్మాత్మిక సేవా సమితి సభ్యులు పాదయాత్ర చేస్తూ మంగళవారం సాయంత్రం రత్నగిరిపై సత్యదేవుని సన్నిధికి చేరుకున్నారు. ఈ బృందంలోని 300 మంది భక్తులు గత శుక్రవారం జంగారెడ్డిగూడెంలో బయలుదేరారు. ఐదు రోజుల పాటు పాదయాత్ర చేసి రత్నగిరికి చేరుకున్నట్లు ఆ బృందానికి నాయకత్వం వహించిన రామారావు తెలిపారు. ఈ విధంగా కాలినడకన అన్నవరం చేరడం ఇది 25వ సారి అన్నారు. కాగా.. ఆ భక్తులను అన్నవరం దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు అభినందించారు. వారికి ప్రత్యేక దర్శనంతో బాటు స్వామి వారి నిత్యాన్నదాన పథకంలో భోజన సౌకర్యం కల్పించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement