అంతర్‌ జిల్లా దొంగల ముఠా అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

అంతర్‌ జిల్లా దొంగల ముఠా అరెస్ట్‌

Jun 10 2026 1:01 AM | Updated on Jun 10 2026 1:01 AM

రూ.12.10 లక్షల విలువైన సొత్తు స్వాధీనం

విలేకరులకు వెల్లడించిన

డీఎస్పీ దేవకుమార్‌

పెరవలి (కొవ్వూరు): అంతర్‌ జిల్లా దొంగల ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకుని, వారి నుంచి రూ.12.10 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులతో పాటు కారును స్వాధీనం చేసుకున్నారు. ఆ ముఠాలోని ఐదుగురు సభ్యులను అరెస్టు చేశారు. ఈ విషయాన్ని కొవ్వూరు డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ జి.దేవకుమార్‌ మంగళవారం విలేకరులకు తెలిపారు. ఆ ప్రకారం.. ఉండ్రాజవరం మండలం పాలంగిలోని జగతా వెంకటేశ్వరరావు ఇంట్లో మే 21న జరిగిన చోరీ కేసులో వీరిని పోలీసులు అరెస్టు చేశారు. వీరందరూ అంతర్‌ జిల్లా నేరస్తులు, వీరిపై పలు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. రెక్కీ నిర్వహించి తాళాలు వేసిన ఇళ్లను గుర్తించడం, అనంతరం వాటిలో చోరీ చేయడం వీరి అలవాటు. కడప, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ, కోససీమ జిల్లాల్లో పలు కేసుల్లో ఈ ఐదుగురు నిందితులుగా ఉన్నారు. కాగా.. చోరీల ఘటన నేపథ్యంలో పోలీసులు ముమ్మర దర్యా ప్తు చేపట్టారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో వాహనాల తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన నిందితులను పట్టుకున్నారు. వీరిలో ప్రధాన నిందితుడు కిరణ్‌పై అనేక కేసులు ఉన్నాయి. కాగా.. కేసును చేధించిన నిడదవోలు సీఐ తిలక్‌, ఎస్సై రవికుమార్‌, క్రైమ్‌ ఎసై రవీంద్రను ఎస్పీ అభినందించారని, వీరికి రివార్డులు ప్రకటించారని డీఎస్పీ తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement