బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించామని చెప్పుకొని నిరుద్యోగ యువతను దగా చేసిందని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు శెట్టిబత్తుల కుమార్ రాజా అన్నారు. పార్టీ పిలుపు మేరకు మెగా డీఎస్సీపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతూ సోమవా రం ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో స్థానిక ఇంద్రపాలెం బ్రిడ్జి సమీపంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. అనంతరం కలెక్టర్ హరేంధిరప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. కుమార్ రాజా మాట్లాడుతూ నిరుద్యోగ యువత భవిష్యత్తుకు సంబంధించిన కీలకమైన ఈ పరీక్షలో అన్ని అవకతవకలు జరిగాయన్నారు. అధికార దుర్వినియో గం జరిగిందన్న నిరుద్యోగులు అనుమానం వ్య క్తం చేస్తున్నారన్నారు. పరీక్షల నిర్వహణ, స్పోర్ట్స్ కోటాలో ఎంపిక, సర్టిఫికెట్ల పరిశీలన అంశాల్లో అనేక సందేహాలు ఉన్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ బీ సీ మైనార్టీ పేద నిరుద్యోగ అభ్యర్థులకు డీఎస్పీలో అన్యాయం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో డీఎ స్సీ లీకేజీపై పూర్తిస్థాయిలో సీబీఐ విచారణ చే యించాలన్నారు. ప్రశ్నాపత్రం తయారీ నుంచి పరీక్ష నిర్వహణ వరకు మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయాలన్నారు. అక్రమాలకు పాల్పడిన అధికారులు, రాజకీయ ఒత్తిడికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలన్నారు. డీఎస్సీ సక్రమంగా నిర్వహించలేని విద్యాశాఖమంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మాజీ డిప్యూటీ మేయర్ మీసాల ఉదయ్‌కుమార్, ఎస్సీ సెల్ నాయకులు పాల్గొన్నారు.


