నడవలేని స్థితిలో ఉన్నాను. పింఛన్ కోసం ఏడాదిగా మనిషి సహాయంతో తిరుగుతున్నాను. ఎక్కడికై నా వెళితే వీర్‌చైర్‌లో వెళ్లాల్సి వస్తోంది. స్థానికంగా ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఎన్నో ఇబ్బందులు పడి కలెక్టరేట్‌కు వచ్చినా ఎవరూ స్పందించడం లేదు. – షేక్ కాశీంబీబీ, గొల్లప్రోలు
నా భూమికి పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదు
ఏళ్లతరబడి నా అధీనంలో ఉన్న భూమి నేనే సాగు చేసుకొంటున్నాను. వేరే వ్యక్తుల వద్ద భూమి కొనుగోలు చేశాను. నాకు పాస్‌పుస్తకాలు ఇవ్వడం లేదు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. రెవెన్యూ అధికారులు వేరే వ్యక్తుల వద్ద డబ్బు తీసుకొని నా సర్వే నంబర్‌లో వేరే వ్యక్తి పేరు నమోదు చేశారు. నాలుగు నెలలుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నాను.
– బస్వా శ్రీనివాస్, చిత్రాడ, పిఠాపురం మండలం.
రెవెన్యూ రికార్డులు మార్పు చేశారు
నా పేరు మీద ఉన్న భూమికి వేరే వ్యక్తికి ఆన్‌లైన్ నమోదు చేశారు. ఆ భూమి పూర్వార్జితం. స్థానిక రెవెన్యూ అధికారులు చుట్టూ ఏడాదిగా తిరుగుతున్నా. చాలాసార్లు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశాను. కానీ సమస్య పరిష్కారం కావడం లేదు.
– అంబుజాలపు మంగ, సీతంపేట, శంఖవరం మండలం


