వి.కొత్తూరులో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాల, కళాశాల విద్యాలయంలో విద్యార్థినుల భోజనశాల ప్రమాదకరంగా మారింది. 2002లో నిర్మించిన ఈ భవనం పూర్తిగా శిథిలమైంది. ఐదు నుంచి ఇంటర్ వరకూ ఉన్న సుమారు 540 మందికి ఇక్కడే భోజనాలు వడ్డిస్తుంటారు. ఒక భాగం పూర్తిగా పాడవగా, రెండో భాగంలో విద్యార్థులు విడతల వారీగా భోజనాలు చేస్తున్నారు. ఇటీవల కలెక్టర్ హరేంధిర ప్రసాద్ ఈ విద్యాలయాన్ని సందర్శించి, శిథిలావస్థలో ఉన్న భాగాన్ని పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు.
వి.కొత్తూరు


