ఇతర ప్రాంతాల నుంచి తెస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

ఇతర ప్రాంతాల నుంచి తెస్తున్నాం

Jun 7 2026 12:21 AM | Updated on Jun 7 2026 12:21 AM

నోటరీ స్టాంపులు అందుబాటులో లేక అనేక ఇబ్బందులు పడుతున్నాం. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న ప్రస్తుత తరుణంలో విద్యార్థులకు అనేక పత్రాలపై నోటరీ తప్పనిసరి. సరిగ్గా ఇదే సమయంలో నోటరీ స్టాంపులు లభించడం లేదు. దీంతో, అనేక ఇబ్బందులు పడుతూ ఇతర ప్రాంతాల నుంచి స్టాంపులు తీసుకు వస్తున్నాం.

– జి.వెంకట దుర్గాప్రసాద్‌, న్యాయవాది, కాకినాడ

స్టాంపులు లేక అవస్థలు

కోర్టులో దాఖలు చేసే వివిధ పిటిషన్లు, వివాహ రిజిస్ట్రేషన్లు, సమాచార హక్కు చట్టం దరఖాస్తులు, ఇతర అంశాలకు కోర్టు ఫీ స్టాంపులు ఎంతో అవసరం. కానీ, అవి అందుబాటులో లేక ఎంతో ఇబ్బంది పడుతున్నాం. జిల్లా అధికారులు ఇతర ప్రాంతాల నుంచి కోర్టు ఫీ స్టాంపులను కాకినాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి తీసుకువచ్చి సమస్య పరిష్కరించాలి.

– వీరాబత్తుల రాజు, న్యాయవాది, కాకినాడ

నగదు చెల్లింపులకు ఇబ్బంది

రెవెన్యూ స్టాంపులు అందుబాటులో లేకపోవడంతో నగదు లావాదేవీలు జరిగినప్పుడు ఇబ్బందులు పడుతున్నాం. అన్ని నగదు వ్యవహారాలపై రెవెన్యూ స్టాంపులు తప్పనిసరి. అధికారులు స్పందించి, సమస్య పరిష్కరించాలి.

– ఎన్‌.శివరామకృష్ణ, కాకినాడ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement