పిల్లలతో కనెక్ట్‌ అవ్వండి.. | - | Sakshi
Sakshi News home page

పిల్లలతో కనెక్ట్‌ అవ్వండి..

Jun 11 2026 7:35 AM | Updated on Jun 11 2026 7:35 AM

బిడ్డ మీ పక్కనే కూర్చుని ఉండవచ్చు

కాని వారి చేతిలో ఉన్న ఫోన్‌ మిమ్మల్ని

ఆమడ దూరంలో ఉంచుతోంది. వారు ‘ఆన్‌లైన్‌’ అవ్వకముందే, మీరు వారితో ‘కనెక్ట్‌’ అవ్వండి.

లేదంటే ఆ రంగుల ప్రపంచం మీ ప్రేమని బలితీసుకుంటుంది..

ప్రేమ విఫలమైందో, బైక్‌ కొనివ్వలేదో, కఠినావేశంలో ప్రాణాలు తీసుకునే స్థితికి మన పిల్లలు చేరుతున్నారంటే...

అది వారి బలహీనత మాత్రమే కాదు..

మనం వారితో గడిపే సమయం తగ్గిందనడానికి నిదర్శనం.

బిడ్డలకు ఆస్తిని ఇవ్వకపోయినా పర్వాలేదు..

వారి బాధను పంచుకునే ‘అమ్మ ఒడిని’, ‘నాన్న భుజాన్ని’ తోడుగా ఇవ్వండి.

మోటె శివకుమార్‌

గ్రామం : కాకునూరు, రంగారెడ్డి (జిల్లా)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement