తాగే నీటిలో మైక్రోప్లాస్టిక్స్.. ఇలా క్లీన్‌ చేయొచ్చని శాస్త్రవేత్తల గుర్తింపు | This common plant could clean microplastics from your drinking water | Sakshi
Sakshi News home page

తాగే నీటిలో మైక్రోప్లాస్టిక్స్.. ఇలా క్లీన్‌ చేయొచ్చని శాస్త్రవేత్తల గుర్తింపు

Apr 21 2026 4:28 PM | Updated on Apr 21 2026 4:35 PM

 This common plant could clean microplastics from your drinking water

మునగ భారతదేశానికి చెందిన మొక్క. ఇది ఉష్ణమండల ప్రాంతాల్లో బాగా పెరుగుతుంది. దీని ఆకులు, గింజల పోషక విలువల కారణంగా ఆహారంగా బాగా వినియోగిస్తారు. నీటి శుద్ధిలో ఇది ఉపయోగపడవచ్చని శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాలుగా ఈ గింజలపై పరిశోధనలు చేస్తున్నారు.

మునగ గింజలు నీటిలోని మైక్రోప్లాస్టిక్స్‌ను బయటకు తీయడంలో సహాయపడతాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇవి సాధారణ రసాయన చికిత్సలతో సమానంగా పనిచేస్తున్నాయని తెలిపారు. మొక్క ఆధారిత సారం ప్లాస్టిక్ కణాలను ఒకదానికొకటి అంటుకునేలా చేసి వడపోతలో సులభంగా తొలగించేలా చేస్తుంది.

కొన్ని పరిస్థితుల్లో ఇది సంప్రదాయ రసాయనాల కంటే మెరుగ్గా పనిచేసింది. తక్కువ ఖర్చుతో సహజ పద్ధతిలో పరిష్కారం దొరుకుతుంది. తాగునీటి శుద్ధి విషయంలో ఇది పెద్ద మార్పు తీసుకురావచ్చు. బ్రెజిల్ సావో పాలో స్టేట్ యూనివర్సిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్ ఐసీటీ యునెస్ప్ సావో జోసే డోస్ కాంపోస్‌లో పరిశోధకులు మోరింగా ఒలీఫెరా (సాధారణంగా మునగ లేదా వైట్ అకేషియా అని పిలిచే మొక్క) నీటిలోని మైక్రోప్లాస్టిక్స్‌ను తొలగించడంలో సహాయపడుతుందని గుర్తించారు. ఈ ఫలితాలు అమెరికన్ కెమికల్ సొసైటీ జర్నల్ ఏసీఎస్ ఒమెగాలో ప్రచురితమయ్యాయి.

రసాయన చికిత్సలా మునగ గింజల సారం  
‘ఈ గింజల ఉప్పు సారం అల్యూమినియం సల్ఫేట్ లాగా పనిచేస్తుంది. ఇది మైక్రోప్లాస్టిక్స్ ఉన్న నీటిని గడ్డకట్టేలా చేస్తుంది క్షార స్వభావం ఎక్కువగా ఉన్న నీటిలో ఇది రసాయన ఉత్పత్తి కంటే మెరుగ్గా పనిచేసింది’ అని శాస్త్రవేత్త గాబ్రియెల్లే బాటిస్టా తెలిపారు. ఆమె పీజీ సివిల్ అండ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్ పీపీజీఈసీఏలో మాస్టర్స్ సమయంలో ఈ పరిశోధన చేశారు.

ఈ పరిశోధనకు ఐసీటీ యునెస్ప్ ప్రొఫెసర్ ఆడ్రియానో గోన్కాల్వెస్ డోస్ రైస్ నాయకత్వం వహించారు. ఆయన మైక్రోప్లాస్టిక్స్ తొలగింపు ప్రాజెక్ట్‌కు కూడా నాయకత్వం వహిస్తున్నారు. ఇది ఫాపెస్ప్ మద్దతుతో నడుస్తోంది.

అల్యూమినియం సల్ఫేట్‌లో ప్రధాన లోపం కరిగిన సేంద్రీయ పదార్థం పెరగడం. దీన్ని తొలగించే ప్రక్రియ ఖర్చును పెంచుతుంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో దీన్ని తక్కువ ఖర్చుతో సమర్థంగా ఉపయోగించవచ్చని రైస్ తెలిపారు.

మైక్రోప్లాస్టిక్స్ తొలగింపులో కోగ్యులేషన్ కీలకం
కోగ్యులేషన్ అంటే చిన్న చిన్న కణాలు ఒకదానికొకటి అతుక్కుని పెద్ద గుంపులుగా మారే ప్రక్రియ. సరళంగా చెప్పాలంటే నీటిలో తేలియాడే సూక్ష్మ కణాలు విడిగా ఉండకుండా ఒకచోట చేరేలా చేయడం. నీటి శుద్ధిలో ఇది ముఖ్యమైన దశ. ఈ ప్రక్రియలో కణాలపై ఉన్న విద్యుత్ ఛార్జ్ తగ్గించి వాటిని కలిసేలా చేస్తారు. దీంతో అవి పెద్ద ముద్దలుగా మారి సులభంగా వడపోతలో తొలగించవచ్చు

మైక్రోప్లాస్టిక్స్ ఇతర కాలుష్య కణాలకు నెగటివ్ విద్యుత్ ఛార్జ్ ఉంటుంది. అందువల్ల అవి ఒకదానిని మరొకటి తోసుకుంటాయి. వడపోతలో వాటిని పట్టడం కష్టమవుతుంది. కోగ్యులెంట్లు మునగ ఉప్పు సారం అల్యూమినియం సల్ఫేట్ ఈ ఛార్జ్‌ను తటస్థం చేస్తాయి. దీంతో కణాలు పెద్ద గుంపులుగా మారతాయి.. సులభంగా తొలగించవచ్చు. గత పరిశోధనలో మునగ గింజలు ఫ్లోక్యులేషన్ సెడిమెంటేషన్ ఫిల్ట్రేషన్ వంటి పూర్తి శుద్ధి ప్రక్రియలో సమర్థంగా పనిచేస్తాయని నిరూపించాయి.

ప్రయోగశాల పరీక్షలు
పరిశీలన కోసం బృందం ట్యాప్ నీటిలో పాలీవినైల్ క్లోరైడ్ పీవీసీ మైక్రోప్లాస్టిక్స్ కలిపింది. పీవీసీ పాలీవినైల్ క్లోరైడ్ ఆరోగ్యానికి హానికరమైన ప్లాస్టిక్ ఇది. జన్యు మార్పులకు క్యాన్సర్‌కు కారణమయ్యే లక్షణాలు ఉంటాయి. ఇది నీటి ఉపరితలాల్లో సాధారణంగా కనిపిస్తుంది. సంప్రదాయంగా మనం చేసే నీటి శుద్ధి తర్వాత కూడా మిగిలి ఉండవచ్చు. 

పీవీసీపై అల్ట్రావయొలెట్ కిరణాలు ప్రయోగించారు. తర్వాత కలుషిత నీటిని జార్ టెస్ట్ విధానంతో కోగ్యులేషన్ ఫిల్ట్రేషన్ చేశారు. ఇది చిన్న స్థాయి నీటి శుద్ధి ప్రక్రియ. ఫలితాలను కొలవడానికి స్కానింగ్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ ఎస్ఈఎం ఉపయోగించారు. ఇది సూక్ష్మ కణాలను పెద్దగా చూపించే సాంకేతిక పద్ధతి. కణాల పరిమాణం గుంపులను హై స్పీడ్ కెమెరా లేజర్ కొలతలతో విశ్లేషించారు. రెండు విధానాలు సమానంగా మైక్రోప్లాస్టిక్స్ తొలగించాయి. 
 

Advertisement
 
Advertisement
Advertisement