గణపవరం : మండలంలోని పిప్పరలో అనుమానాస్పదంగా తిరుగుతున్న 8, 11 సంవత్సరాల వయస్సు ఉన్న ఇద్దరు చిన్నారు లను గుర్తించిన స్థానికులు గణపవరం పోలీసులకు సమాచా రం ఇచ్చారు. దీంతో ఎస్సై మణికుమార్ సిబ్బందితో పిప్పర వెళ్లి ఇద్దరు బాలురను గుర్తించి వారి వివరాలు అడగ్గా ఒకరు తనపేరు మరోలు సాయి అని, తండ్రి పేరు శంకర్, బందరు సమీపంలో గోకవరం గ్రామం అని చెప్పగా, మరో బాలుడు తనపేరు నాగరాజు అని, తండ్రి ఏడుకొండలు అని అదే గ్రామం అని చెప్పగా వారిని గణపవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఉమెన్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ అధికారులను పిలిపించి వారు సమక్షంలో ఇద్దరు బాలురను వారి తల్లిదండ్రులకు అప్పగించినట్లు ఎస్‌ఐ మణికుమార్ తెలిపారు.


