కుమార్తెకు ఇచ్చిన ఆస్తి తిరిగి ఇప్పించాలని వినతి | - | Sakshi
Sakshi News home page

కుమార్తెకు ఇచ్చిన ఆస్తి తిరిగి ఇప్పించాలని వినతి

Feb 17 2026 7:30 AM | Updated on Feb 17 2026 7:30 AM

కుమార

కుమార్తెకు ఇచ్చిన ఆస్తి తిరిగి ఇప్పించాలని వినతి

అమలాపురం రూరల్‌: కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ చాలా గొప్పదంటారు. సరిగ్గా ఇలాగే తమకు పిల్లలు లేరన్న లోటు తీర్చుకునేందుకు సమీప బంధువుల కుమార్తెను పెంచి పెద్ద చేసి బాగా చదివించి తమకున్న ఆస్తినంతా రాసిచ్చిన తరువాత తీరా వృద్ధాప్యంలో చూడను పొమ్మంటోందని ఓ వృద్ధురాలు కలెక్టర్‌కు సోమవారం ఫిర్యాదు చేసింది. మొగళ్లమూరు గ్రామానికి చెందిన వాసర్ల లక్ష్మి పీజీఆర్‌ఎస్‌లో ఈ మేరకు అర్జీ అందజేసింది. తన భర్త ఉండగా ఇద్దరం కలిసి వచ్చి తమ పెంపుడు కుమార్తైపె పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశామని, అయితే ఇప్పటికీ తనకు న్యాయం చేయలేదని ఆ వృద్ధురాలు వాపోయింది. మొగళ్లమూరు గ్రామానికి చెందిన వాసర్ల వెంకట నర్సయ్య, లక్ష్మీ దంపతులమైన తాము తమ పెంపుడు కుమార్తె వాసంశెట్టి జ్యోతి అనే ఆమైపె గతంలో ఫిర్యాదు చేశామని పేర్కొంది. అయితే ఇటీవల ఆమె వేధింపులు మరింత ఎక్కువవడంతో మానసిక వేదనకు గురైన తన భర్త మృతిచెందాడని తెలిపింది. ఒంటరిగా మిగిలిన తనకు తన భర్త కష్టార్జితమైన ఆస్తిని తిరిగి ఇప్పించి, న్యాయం చేయాలని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. తన భర్త ఆసుపత్రి పాలైనా కనీసం వచ్చి చూడలేదని, ఆయన మృతిచెందాక వచ్చి ఆస్తి కోసం తనను దూషిస్తూ గొడవకు దిగిందని తెలిపింది. కలెక్టర్‌ విచారణ పూర్తిచేసి తన భర్త ఆమెకు రాసిచ్చిన రెండున్నర ఎకరాల దాన సెటిల్మెంట్‌ రిజిస్ట్రేషన్‌ను రద్దుచేసి తనకు ఇప్పించాలని కోరింది. ఒంటరిగా జీవిస్తున్న తనకు పెంపుడు కుమార్తె నుంచి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేసింది.

హోరాహోరీగా వాలీబాల్‌

ఉప్పలగుప్తం: జాతీయ స్థాయి వాలీబాల్‌ పోటీలు హో రాహోరీగా సాగుతున్నాయి. ఆయా జట్లు నువ్వా నేనా అన్నట్టుగా తలపడడంతో పోటీలు రసవత్తరంగా మా రాయి. ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి జెడ్పీ ఉన్న త పాఠశాల క్రీడా మైదానంలో అరిగెల శ్రీ రంగయ్యా మెమోరియల్‌ వాలీబాల్‌ పోటీలు రెండవ రోజు సోమవారం ఉత్కంఠ భరింతగా సాగాయి. ఆల్ఫన్స్‌ (కేరళ) జట్టుతో సికింద్రాబాద్‌ సెంట్రల్‌ రైల్వే జట్లు తలపడగా మూడు సెట్‌లు సికింద్రాబాద్‌ గెలుచుకుంది. తరువాత మ్యాచ్‌లో ఇండియన్‌ బ్యాంకు (చైన్నె), కర్ణాటక జట్ల మధ్య జరిగిన పోటీలో వరుసగా మూడు సెట్‌లు ఇండియన్‌ బ్యాంకు గెలుచుకుంది. ఇండియన్‌ బ్యాంకు (చైన్నె) జట్టు, ఎస్‌ఏఐ (కేరళ) జట్ల మధ్య జరిగిన పోరులో మూడు సెట్‌లు ఇండియన్‌ బ్యాంకు గెలుకుంది. టోర్నమెంట్‌ నిర్వాహక అధ్యక్షుడు దేశంశెట్టి లక్ష్మీ నారాయణ, అరిగెల వెంకట ముసలయ్య, పీడీ గొలకోటి ఫణి పోటీలను పర్యవేక్షిస్తున్నారు.

కుమార్తెకు ఇచ్చిన ఆస్తి తిరిగి  ఇప్పించాలని వినతి1
1/1

కుమార్తెకు ఇచ్చిన ఆస్తి తిరిగి ఇప్పించాలని వినతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement