ఇండియాకు టెస్లా సిక్స్ సీటర్ కారు! | Tesla is Preparing to Launch Six Seater Model in India | Sakshi
Sakshi News home page

ఇండియాకు టెస్లా సిక్స్ సీటర్ కారు!

Apr 18 2026 3:08 AM | Updated on Apr 18 2026 3:08 AM

Tesla is Preparing to Launch Six Seater Model in India

అమెరికన్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. గత సంవత్సరం చైనాలో ప్రపంచవ్యాప్తంగా తొలిసారిగా ఆరు సీట్ల, లాంగ్ వీల్‌బేస్ కాన్ఫిగరేషన్ అయిన మోడల్ YL ఆవిష్కరించింది. దీనిని కంపెనీ భారతదేశంలో కూడా లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ వేరియంట్‌లో మూడు-వరుసల సీటింగ్ లేఅవుట్ ఉంది.

ఈ కొత్త మోడల్ చైనాలోని షాంఘై గిగాఫ్యాక్టరీ నుంచి ఇతర దేశాలకు చేరుకుంటుంది. కాబట్టి దీని ధర భారతదేశంలో కొంత ఎక్కువగానే ఉంటుంది. పూర్తిగా కొత్త ప్లాట్‌ఫారమ్‌లను ప్రారంభించకుండానే తమ పోర్ట్‌ఫోలియోను పునరుద్ధరించడానికి టెస్లా చూస్తోంది. అయితే రాబోయే కొత్త కారుకు సంబంధించిన వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా.. టెస్లా ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో తన ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది. భారతదేశ అధికారిక వాహన రిజిస్ట్రేషన్ డేటా ప్రకారం, టెస్లా 2025 సంవత్సరమంతటికీ దేశంలో కేవలం 227 కార్లను మాత్రమే రిజిస్టర్ చేసింది. దీన్నిబట్టి చూస్తే కంపెనీ సేల్స్ ఊహించిన దానికంటే తక్కువ ఉన్నట్లు తెలుస్తోంది.
 
టెస్లా ఆగస్టులో చైనాలో మోడల్ YLను ఆవిష్కరించింది. దీని ధర సుమారు 3,39,000 యువాన్ల (49,679 డాలర్లు) నుంచి ప్రారంభమవుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్-వాహనాల మార్కెట్‌లో ఇది ప్రామాణిక మోడల్ Y కంటే ఉన్నత స్థానంలో నిలిచింది.  మోడల్ YL కేవలం చైనాకు మాత్రమే పరిమితమైన ఉత్పత్తి కాదని కంపెనీ సంకేతాలు ఇచ్చింది. ఈ వాహనం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి మార్కెట్‌ల కోసం ఇప్పటికే ధృవీకరించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement