Rasi Phalalu: ఈ రాశి వారు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు | Today Telugu Horoscope On May 20th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి వారు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు

May 20 2024 6:22 AM | Updated on May 20 2024 9:31 AM

Rasi Phalalu On 20-05-2024 In Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, తిథి: శు.ద్వాదశి ప.3.05 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం: చిత్త తె.5.17 వరకు(తెల్లవారితే మంగళవారం), తదుపరి స్వాతి, వర్జ్యం: ఉ.11.43 నుండి 1.27 వరకు, దుర్ముహూర్తం: ప.12.22 నుండి 1.10 వరకు, తదుపరి ప.2.58 నుండి 3.46 వరకు, అమృతఘడియలు: రా.10.05 నుండి 11.34 వరకు; రాహుకాలం: ఉ.7.30 నుండి 9.00 వరకు, యమగండం: ఉ.10.30 నుండి 12.00 వరకు, సూర్యోదయం: 5.31, సూర్యాస్తమయం: 6.21. 

మేషం: ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనయోగం. ప్రముఖులతో చర్చలు సఫలం. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

వృషభం: కుటుంబంలో సమస్యలు. పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలు ముందుకు సాగవు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

మిథునం: శ్రమ తప్పకపోవచ్చు. కొన్ని వివాదాలు ఇబ్బందిగా మారతాయి. ఆరోగ్య సమస్యలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కర్కాటకం: బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో కొత్త ఆశలు.

సింహం: సమస్యలతో సతమతం. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. మీ ఆలోచనలు నిలకడగా ఉండవు. భూవివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

కన్య: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొంటారు. పరపతి పెరుగుతుంది. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

తుల: సన్నిహితుల నుండి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో తొందరపాటు. ఆస్తుల వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

వృశ్చికం: వ్యవహారాలలో విజయం. ఆప్తులు, శ్రేయోభిలాషులతో సఖ్యత. విందువినోదాలు. అరుదైన ఆహ్వానాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.

ధనుస్సు: యత్నకార్యసిద్ధి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మకరం: పనుల్లో అవాంతరాలు. రుణయత్నాలు. కష్టపడ్డా ఫలితం ఉండదు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కుంభం: వ్యవహారాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మీనం: ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుండి శుభవర్తమానాలు. వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement