రథం తయారీకి రూ.3 లక్షల విరాళం | - | Sakshi
Sakshi News home page

రథం తయారీకి రూ.3 లక్షల విరాళం

Jun 14 2026 7:28 AM | Updated on Jun 14 2026 7:28 AM

గౌరీ పరమేశ్వరుల ఆలయ నూతన రథం కోసం విరాళం అందజేస్తున్న దాతలు

అనకాపల్లి టౌన్‌: పట్టణంలోని వేల్పులవీధి గౌరీ పరమేశ్వరుల ఆలయంలో వినియోగించేందుకు నూతన రథం తయారు చేయడానికి దాతలు రూ.3 లక్షలు విరాళం ఇచ్చారు. అదే వీధికి చెందిన దాసరి బినేశ్వరరావు (డి.బి. రావు), పార్వతిల దంపతుల కుమారులు గోవిందరావు, రజని, తివిక్రమ్‌, విజయశ్రీ దంపతులు ఈ మొత్తాన్ని ఆలయ ప్రతినిధులకు శనివారం అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అధ్యక్ష, కార్యదర్శులు గరికి వెంకటరావు, నానేపల్లి రవి కుమార్‌, మద్దాల కూర్మారావు, నల్లల శ్రీనివాస రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement