అప్పన్నకు విశేషంగా ఆర్జితసేవలు | - | Sakshi
Sakshi News home page

అప్పన్నకు విశేషంగా ఆర్జితసేవలు

Jun 14 2026 7:28 AM | Updated on Jun 14 2026 7:28 AM

ఘనంగా సహస్రనామార్చన

వైభవంగా నిత్యకల్యాణం

సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి శనివారం ఆర్జిత సేవలు విశేషంగా జరిగాయి. ఉదయం సహస్రనామార్చనని ఘనంగా నిర్వహించారు. స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవిలను ఆలయ కల్యాణ మండపంలో వేదికపై వేంజేపచేశారు. 1001నామాలతో స్వామికి అర్చన చేశారు. విశేషంగా హారతులు అందజేశారు.

వైభవంగా నిత్యకల్యాణం

శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామికి శనివారం నిత్యకల్యాణం వైభవంగా జరిగింది. ఆలయ కల్యాణమండపంలో వేదికపై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి,భూదేవిలను వేదికపై వేంజేపచేశారు. విష్వక్సేనపూజ, పుణ్యాహవాచనం, కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెళ్లం, మాంగళ్యదారణ, తలంబ్రాలు తదితర ఘట్టాలతో కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉభయదాతలకు స్వామివారి అక్షింతలు, ప్రసాదం, శేషవస్త్రాలను అందజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement