బడి స్మృతులు.. | - | Sakshi
Sakshi News home page

బడి స్మృతులు..

Jun 15 2026 1:47 AM | Updated on Jun 15 2026 1:47 AM

9లోu

న్యూస్‌రీల్‌

సోమవారం శ్రీ 15 శ్రీ జూన్‌ శ్రీ 2026

హుషారుగా వెళ్లేవాడిని..

చిన్నతనంలో బడికి హుషారుగా వెళ్లేవాడిని. ఏ రోజు మారం చేయలేదు. అమ్మ అమిత్‌షా చిన్నతనంలోనే చదువు ప్రాధాన్యత, క్రమశిక్షణ నేర్పించారు. ఆ స్ఫూర్తితో ఉదయమే నిద్రలేచి ఉత్సాహంగా రెడీ అయ్యేవాడిని. పాఠశాలకు ఎప్పుడూ గైర్హాజరు కాలేదు. చిన్నతనం నుంచి సివిల్స్‌ వరకు ఉపాధ్యాయులు, అధ్యాపకులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినేవాడిని. హోంవర్క్‌ పెండింగ్‌ పెట్టకుండా ఎప్పటికప్పుడు పూర్తి చేసేవాడిని. బీహార్‌లోని శిశు మందిరంలో ఒకటి నుంచి రెండో తరగతి, మిథిల పబ్లిక్‌ స్కూల్‌లో మూడో నుంచి ఐదో తరగతి వరకు చదివాను. తర్వాత మా కుటుంబం రాజస్థాన్‌లోని జైపూర్‌కు రావడంతో అక్కడి మహేశ్వరీ పబ్లిక్‌ స్కూల్‌లో 6 నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు చదివాను. కాన్పూర్‌ ఐఐటీలో సివిల్‌ ఇంజినీరింగ్‌ బీటెక్‌ పూర్తి చేశాను. – రాజర్షిషా, కలెక్టర్‌

సర్కారు బడిలోనే చదివా..

నేను మొదటిరోజు బడికి సంతోషంగానే వెళ్లాను. మా ఇంటి దగ్గరే బడి ఉండేది. 1,2 తరగతులు బ్రాహ్మణవాడ ప్రా థమిక పాఠశాలలో చదివాను. ఆ తర్వాత 5,6 తరగతులు స్టేషన్‌ రోడ్‌లో, 7 నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ బాలికల పాఠశాలలో పూర్తి చేశాను. ఇంటర్‌, డిగ్రీ ప్రభుత్వ కళాశాలల్లోనే పూర్తి చేశాను. గురువులు మాపై ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. రోజూ క్రమం తప్పకుండా బడికి వెళ్లేదానిని. ఆటాపాటలతో విద్యాబోధన చేసేవారు. టీఎల్‌ఎం ఉపయోగించేవారు. – డి.మాధవి, డీఈవో

బాల్యం తిరిగి రాదు..

పాఠశాలలు పునఃప్రారంభమైన మొదటిరోజే బ డికి వెళ్లేవాడిని. నేను జ మ్ముకశ్మీర్‌లోని లిటిల్‌ఫ్లవర్‌ పాఠశాలలో చ దివా ను. వేసవి సెలవుల్లో ఇంటివద్ద ఉండడంతో స్నేహితులతో కలిసే అవకాశం ఉండేది కాదు. పాఠశాలకు వెళితేనే ఫ్రెండ్స్‌తో సరదాగా ఉండేది. మా గురువులు మా పై ప్రత్యేక శ్రద్ధ వహించేవారు. నా ణ్యమైన బోధన చేసేవారు. వారంటే ఎనలేని అభిమానం. అలాగే బాల్యం తిరిగి రాదు. అదో మధుర జ్ఞాపకం. – అఖిల్‌ మహాజన్‌, ఎస్పీ

కష్టపడి చదివారు.. ఉన్నతస్థాయికి ఎది గారు.. ప్రస్తుతం జిల్లా ఉన్నతాధికారులుగా కొనసాగుతున్నారు.. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో తమ బాల్యంలో బడి స్మృతులను ‘సాక్షి’తో మరోసారి గుర్తుకు చేసుకున్నారు. వారి మాటల్లోనే..

– ఆదిలాబాద్‌టౌన్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement