నేషనల్‌ టాలెంట్‌ హంట్‌ పోస్టర్‌ విడుదల | - | Sakshi
Sakshi News home page

నేషనల్‌ టాలెంట్‌ హంట్‌ పోస్టర్‌ విడుదల

Jun 15 2026 1:47 AM | Updated on Jun 15 2026 1:47 AM

కై లాస్‌నగర్‌: కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాల్లో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిందని డీసీసీ అధ్యక్షుడు నరేశ్‌ జాదవ్‌ అన్నారు. టీపీసీసీ మీడియా కమ్యూనికేషన్స్‌ టీమ్‌ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న నేషనల్‌ టాలెంట్‌ హంట్‌ కార్యక్రమ ప్రచార పోస్టర్లను జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువతలో ఉన్న ప్రతిభను వెలికితీసి, కాంగ్రెస్‌ పార్టీ మీడియా, కమ్యూనికేషన్స్‌ విభాగంలో సేవలందించేందుకు ఈ నేషనల్‌ టాలెంట్‌ హంట్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మీడియా ప్రతినిధులు, పబ్లిసిటీ కోఆర్డినేటర్లు, రీసెర్చ్‌ టీమ్‌ సభ్యులుగా పనిచేయాలనే ఆసక్తి ఉన్న యువత @tpccmc. in వెబ్‌సైట్‌ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement