ఆదిలాబాద్‌టౌన్: స్వచ్ఛంద రక్తదానం కోసం యువత ముందుకు రావాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీఎంహెచ్‌వో సాధన అన్నా రు. ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా రిమ్స్‌లో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ, రిమ్స్ బ్లడ్ బ్యాంక్‌లో రక్త నిల్వలు తక్కువగా ఉన్నాయని, యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని కోరా రు.కార్యక్రమంలో పీవో డీటీటీ నరేందర్ రాథో డ్, అదనపు డీఎంహెచ్‌వో మనోహర్, యువజన సంఘాల నాయకులు బాలశంకర్ కృష్ణ, సిరాజ్, సతీష్‌రెడ్డి, శ్రీకాంత్, ప్రమోద్, గణేష్, ఠాకూర్ రాణాప్రతాప్ సింగ్, శశికాంత్, అజీజ్, శశికళ, అనిల్, రాజు, పరమేశ్వర్ పాల్గొన్నారు.


