టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలి

Jun 14 2026 7:28 AM | Updated on Jun 14 2026 7:28 AM

ఆదిలాబాద్‌టౌన్‌: ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు టెట్‌ నుంచి మినహయింపు ఇవ్వాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (టీపీయూఎస్‌) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సునీల్‌ చౌహన్‌, వలబోజు గోపీకృష్ణ అన్నారు. జిల్లా కేంద్రంలోని సంఘ భవనంలో శనివారం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఇటీవల ప్రభుత్వం ప్రత్యేకంగా రెండు సార్లు టెట్‌ నిర్వహిస్తామని పేర్కొందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తెలంగాణలో 30వేల మంది ఉపాధ్యాయులు టెట్‌ పాస్‌ కావాల్సిన అవసరముందని 2028 ఆగస్టు 31 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపుకోసం ప్రత్యేక ఆర్డినెన్స్‌ తీసుకురావాలని పేర్కొన్నారు. ఇందులో సంఘ నాయకులు కేశవ్‌, విలాస్‌, అనిల్‌, నాందేవ్‌ , గంభీర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement