ప్రభుత్వ పాఠశాలలకే ఆ ఊళ్లు మొగ్గు
ఏకగ్రీవ తీర్మానం చేసిన భూతాయి(కే)
ఆదర్శంగా నిలుస్తోన్న వడోని ఎంపీపీఎస్
ఏటా పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య
ఉట్నూర్‌రూరల్: మండలంలోని వడోని ఎంపీపీఎస్‌లో రెండేళ్ల క్రితం వరకు విద్యార్థుల సంఖ్య కేవలం 10 మంది మాత్రమే. పాఠశాల మూతపడే పరి స్థితి. ఈ క్రమంలో ఉపాధ్యాయు ల బోధన తల్లిదండ్రులను ఆలో చనలో పడేసింది. తమ పిల్ల లను ప్రైవేట్ నుంచి సర్కారు బడి బాట పట్టించింది. గతేడాది విద్యార్థుల సంఖ్య 70కి పెరగగా.. ఈ ఏడాది మరో 20 కొత్త ప్రవేశాలు నమోదయ్యాయి. 15మంది ఆరో తరగతికి వెళ్లగా ప్రస్తుతం విద్యార్థుల సంఖ్య 75కు చేరువైంది. ఈ సారి నలుగురు ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు జాయిన్ కావడం గమనార్హం.
తల్లిదండ్రుల్లో పెరిగిన నమ్మకం
ఈ పాఠశాలలో ఉపాధ్యాయులు నాణ్యమైన బోధ న అందిస్తున్నారు. ఫలితంగా విద్యార్థులు ఏటా ఏకలవ్య, గురుకుల, మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి సీట్లు సాధిస్తున్నారు. తద్వారా తల్లిదండ్రుల్లో నమ్మకం పెరిగి ఇక్కడ చదివించేందుకు మొగ్గు చూపుతున్నారు. పాఠశాలలో ప్రస్తు తం ముగ్గురు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఉపాధ్యాయుల సహకారం, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఏటా విద్యార్థుల సంఖ్య పెంపు సాధ్యపడుతుందని ప్రధానోపాధ్యాయుడు రాథోడ్ గజేందర్ పేర్కొంటున్నాడు.


