సిరికొండ: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూ రు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఉమ్మడి ఆదిలా బాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మండలంలోని రిమ్మ గ్రామంలో శనివా రం ఏర్పాటు చేసిన సాముహిక ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. లబ్ధిదారులైన దంపతులకు సారె, దుస్తులు అందజేసి సన్మానించారు. గిరిజన సంప్రదాయాలు గొప్పవని అన్నారు. మాజీ సర్పంచ్ అనిల్‌కుమార్ గ్రా మానికి గ్రంథాలయం కావాలని అడగడంతో మంత్రి వెంటనే స్పందించారు. రూ.10లక్షలు మంజూ రు చేశారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ, నియోజకరవ్గంలోని మారుముల గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని అన్నా రు. కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షిషా, ఎస్పీ అఖిల్ మహాజన్, స్థానిక సర్పంచ్ జంగుబాయి, జిల్లా పంచాయతీ అధికారి రమేశ్, వివిధ శాఖల అధికారులు,కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ప్రజా సంక్షేమమే ధ్యేయం
ఆదిలాబాద్‌రూరల్: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మండలంలోని బెల్లూరి శివారు గాయత్రి గార్డెన్స్‌లో శనివారం నిర్వహించిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.సంక్షేమ పథకాల పారదర్శక అమలుతోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అనంతరం జాబ్ మేళా లో ఉద్యోగాలు పొందిన యువతకు సన్మానం, టా స్క్ సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. అలాగే ఎంపికై న లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదా రులకు చెక్కులు, మైనార్టీ లబ్ధిదారులకు కుట్టు మిష న్లు, అగ్నిమాపక శాఖకు సంబంధించిన ఎస్‌డీఆర్‌ఎఫ్ ఉపకరణాలను పంపిణీ చేశారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఇందులో ఎంపీ నగేష్, కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, ఆదిలాబాద్, ఖానాపూర్ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు, మున్సిపల్ చైర్‌పర్సన్ అనూష, మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీకాంత్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల నర్సయ్య, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
పీహెచ్‌సీ భవనం ప్రారంభం
మావల మండలం బట్టిసావర్‌గాంలో రూ.1.43 కోట్లతో నూతనంగా నిర్మించిన పీహెచ్‌సీ భవనా న్ని మంత్రి జూపల్లి శనివారం ప్రారంభించారు.


