తలమడుగు: నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మండలంలోని ఖోడద్ గ్రామంలో అంతర్రాష్ట్ర రహదారిపై రూ.34 లక్షలతో నిర్మించిన బ్రిడ్జిని ఎమ్మెల్యే శనివారం ప్రారంభించారు. ప్రజల ఇబ్బందుల దృష్ట్యా బ్రిడ్జి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేశామన్నారు. ఇందులో సర్పంచ్ లస్మారెడ్డి, నాయకులు కేదారేశ్వర్‌రెడ్డి, కిరణ్, వెంకటేశ్, ఆనంద్, చందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కరంజి(టి) రహదారి నిర్మాణానికి కృషి
తాంసి: భీంపూర్ మండలంలోని కరంజి(టి) అంతర్రాష్ట్ర రోడ్డు నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. నిపాని నుంచి సావర్గాం మధ్య అంతర్రాష్ట్ర రహదారి ప్రారంభమైన నేపథ్యంలో తాత్కాలిక రోడ్డు మర్మమతు పనులను ఎమ్మెల్యే శనివారం పరిశీలించారు. ఆయన వెంట స్థానిక నాయకులు వినోద్‌రెడ్డి, మహేందర్, అశోక్, సుధాకర్, శ్రీకాంత్ తదితరులున్నారు.


