కై లాస్‌నగర్: సర్ (ఎస్‌ఐఆర్) పేరిట కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంతో విపక్ష పార్టీల ఓట్లు ప్రమాదంలో పడ్డాయని, భారీగా ఓట్ల చోరీ జరుగుతోందని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ నరేష్ జాదవ్ ఆరోపించారు. స్థానిక కంది క్యాంపు కార్యాలయంలో ఆదిలాబాద్ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన బీఎల్‌ఏ–2ల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బీజేపీ ఈసీని అడ్డుపెట్టుకుని పథకం ప్రకారం బీజేపీ వ్యతిరేక ఓట్లు తొలగిస్తుందని ఆరోపించారు. ప్రతి ఒక్కరూ తమ ఓటును కోల్పోకుండా మ్యాపింగ్ చేసుకోవాలన్నారు. ఈవిషయంలో బీఎల్‌ఏ–2ల పాత్ర కీలకమన్నారు. అనంతరం పీసీసీ ట్రైనర్ నరేశ్‌రాథోడ్, కోఆర్డినేటర్లు రాఘవేంద్రరెడ్డి, మోహన్ కుమార్ ఎస్‌ఐఆర్‌పై అవగాహన కల్పించారు. ఇందులో సర్ కోఆర్డినేటర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి, మున్సిపల్, మార్కెట్ కమిటీ చైర్మన్లు బండారి అనూష, బోరంచు శ్రీకాంత్‌రెడ్డి , ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్, నాయకులు సాయి మౌనారెడ్డి, సంజీవ్‌రెడ్డి, సాజిద్ ఖాన్, పరమేశ్వర్, పట్టణ కౌన్సిలర్లు, డీసీసీ కార్యదర్ళులు, మండల అధ్యక్ష,కార్యదర్శులు పాల్గొన్నారు.


