పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Jun 13 2026 7:14 AM | Updated on Jun 13 2026 7:14 AM

● కలెక్టర్‌ రాజర్షి షా

కై లాస్‌నగర్‌: పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్య రక్షణను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఘన వ్యర్థాల నిర్వహణకు నూతన నియమాలను అమలు చేస్తోందని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో ‘స్వచ్ఛ తెలంగాణ’ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఘన వ్యర్థాల నిర్వహణపై అవగాహన కల్పించేలా ముద్రించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. వర్మి కంపోస్టు బెడ్స్‌ (వానపాముల ఎరువు తయారీ షెడ్డు)ను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలను పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. ప్రతి గ్రామం, పట్ట ణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ, పారిశుధ్య నిర్వహణ అనేది అందరి బాధ్యత అని అన్నారు. ఇళ్ల నుంచి సేకరించిన తడి చెత్తను గ్రామాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వర్మి కంపోస్టు బెడ్స్‌కు తరలించి సేంద్రియ ఎరువు తయారు చేయనున్నట్లు తెలిపారు. వ్యాపార సంస్థలు, హోటళ్లు, మార్కెట్లు, బస్టాండ్ల నిర్వాహకులు తమ పరిసరాల్లో తప్పనిసరిగా డస్ట్‌బిన్లు ఏర్పాటు చేసి పరిశుభ్రతకు సహకరించాలన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో రవీందర్‌ రాథోడ్‌, సీసీలు కార్తీక్‌, యాసిన్‌, స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ప్రతినిధులు, క్యాంపు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రశాంతంగా ‘ప్రీ ప్రైమరీ’ ఎంపిక రప్రక్రియ

జిల్లాలో ఈ విద్యాసంవత్సరం నుంచి నూతనంగా ప్రారంభిస్తున్న ప్రీ–ప్రైమరీ స్కూళ్లలో ఇన్‌స్ట్రక్టర్‌, ఆయా పోస్టుల నియామకాలకు సంబంధించి ఎంపిక ప్రక్రియ శుక్రవారం ప్రశాంతంగా ము గిసింది. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో కలెక్టర్‌ రాజర్షి షా ఆధ్వర్యంలో ఈ ప్రక్రి య చేపట్టారు. 74 ఇన్‌స్ట్రక్టర్‌, 74 ఆయా పోస్టులకు వేలల్లో దరఖాస్తులు అందగా మెరిట్‌ ప్రతిపాదికన ఒక్కో పోస్టుకు ఇద్దరి చొప్పున పిలిచారు. ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హులైన వారికి ఎంపిక చేశారు. వీరికి సోమవారం నియామక పత్రాలను అందజేయనున్నారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌, శిశు సంక్షేమ శాఖ అధికారి మిల్కా, జిల్లా విద్యాశాఖ అధికారులు లక్ష్మణ్‌, రఘురమణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement