‘ఎన్నికల హామీలు విస్మరించిన బీజేపీ’ | - | Sakshi
Sakshi News home page

‘ఎన్నికల హామీలు విస్మరించిన బీజేపీ’

Jun 13 2026 7:14 AM | Updated on Jun 13 2026 7:14 AM

కై లాస్‌నగర్‌: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల హామీలను విస్మరించిందని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ నరేష్‌ జాదవ్‌ ఆరోపించారు. అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా సీసీఐ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామనే హామీ ఇచ్చినట్లుగా గుర్తు చేశారు. శుక్రవారం ఆ పార్టీ నాయకులతో కలిసి ఫ్యాక్టరీలో చేపట్టిన కూల్చివేత పనులను ఆయన పరిశీలించారు. ప్రజలకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో సిమెంట్‌ కర్మాగారాన్ని ఏర్పాటు చేసిందన్నారు. అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దాన్ని పునరుద్ధరించకుండా శాశ్వతంగా తుక్కుగా మార్చేస్తోందని మండిపడ్డారు. ఆయన వెంట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శ్రీకాంత్‌ రెడ్డి, నాయకులు సాజీద్‌ఖాన్‌, రూపేష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement