నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం

Jun 13 2026 7:14 AM | Updated on Jun 13 2026 7:14 AM

ఆదిలాబాద్‌టౌన్‌: నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని ఎస్పీ అఖిల్‌ మహా జన్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్‌ క మాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఆదిలాబాద్‌ పట్ట ణ కౌన్సిలర్లు, ఆదిలాబాద్‌రూరల్‌, జైనథ్‌, భీం పూర్‌, బేల, తాంసి, తలమడుగు మండలా ల సర్పంచ్‌లకు సీసీ కెమెరాల ప్రాధాన్యతపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లాలో గతంలో సీసీ ఫుటేజీ ఆధారంగా ఛేదించిన పలు కేసులకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి వాటి ప్రాముఖ్యతను వివరించారు.సమావేశంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌అనూష, వైస్‌చైర్మన్‌ మహమ్మద్‌ రోహిత్‌, ఆది లాబాద్‌ డీఎస్పీ ఎల్‌.జీవన్‌ రెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ జగదీశ్వర్‌గౌడ్‌, సీఐలు బి.సునీల్‌ కుమార్‌, కె.నాగరాజు, ప్రేమ్‌ కుమార్‌, శ్రావ ణ్‌, రహీంపాషా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement