ఆదిలాబాద్: జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో మెరిశారు. ఈనెల 11,12 తేదీల్లో ఓయూ వేదికగా నిర్వహించిన తెలంగాణ రాష్ట్రస్థాయి మెన్, ఉమెన్, జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ పోటీల్లో జిల్లా అథ్లెట్లు నాలుగు పతకాలతో సత్తా చాటారు. హ్యామర్‌త్రోలో దివిటి అరుణ (స్వర్ణ), డిస్కస్‌త్రోలో కాంస్య పతకాలతో మెరిసింది. ట్రిపుల్ జంప్‌లో సీహెచ్ వసంత స్వర్ణంతో సత్తా చాటగా, హ్యామర్‌త్రోలో రాధారాణి రజత పతకం సాధించింది. అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అడ్డి భోజారెడ్డి, రాజేష్, కోచ్ వీజీఎస్ రాకేశ్ క్రీడాకారులను అభినందించారు.


