ఇంద్రవెల్లి: కేస్లాపూర్ నాగోబా ఆలయంలో మెస్రం వంశ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ నాగోబా ఎక్సలెన్స్ స్కూల్‌ను శుక్రవారం ప్రారంభించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరస్వతి దేవి చిత్రపటానికి పూజలు చేశారు. ఈప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికే శ్రీ నాగోబా ఎక్సలెన్స్ స్కూల్‌ను ప్రారంభించినట్లు మెస్రం వంశీయులు తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ, పేద పిల్లలను నాగోబా స్కూల్‌లో చేర్పించి ఉచిత విద్యను అందిస్తామన్నారు. ఆలయ పీఠాధిపతి మెస్రం వెంకట్‌రావ్, కేస్లాపూర్ సర్పంచ్ తుకారం, మెస్రం వంశం ఉద్యోగులు దేవ్‌రావ్, శేఖర్‌బాబా, మోనోహర్, సోనేరావ్, వంశపెద్దలు కోసేరావ్, హనుమంత్‌రావ్, నాగ్‌నాథ్, భీంరావ్ తదితరులున్నారు.


