రైతులు పంట రుణాల కోసం నేరుగా తమ మొబైల్ ఫోన్ల నుంచి దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కృషిక యాప్ తీసకురావడం మంచి నిర్ణయం. రైతులు బ్యాంకుల చుట్టూ తిరిగే పని తప్పింది. ఈ యాప్ వల్ల వారికి మేలు చేకూరుతుంది.
– నర్సారెడ్డి, రైతు, లక్ష్మణచాంద
సద్వినియోగం చేసుకోవాలి
కృషిక యాప్ ద్వారా రైతులు తమ పంటల సాగుకు అసవరమైన రుణాలను తమ మొబైల్ ఫోన్ల నుంచే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకులకు వెళ్లకుండా రుణాలు పొందవచ్చు. జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి. –రాంగోపాల్, ఎల్‌డీఎం, నిర్మల్


