జన్నారం: అనారోగ్యంతో ఎస్బీ ఎస్సై జాడి గంగన్న మృతిచెందారు. మండలంలోని మురిమడుగు గ్రామానికి చెందిన ఈయన 1989లో కానిస్టేబుల్‌గా ఉద్యోగంలో చేరారు. 2012లో హెడ్ కానిస్టేబుల్‌గా, 2018లో ఏఎస్సైగా, 2024 సెప్టెంబర్ 26న ఎస్సైగా ప్రమోషన్ పొంది, ప్రస్తుతం రామగుండం ఎస్బీ ఎస్సైగా పనిచేస్తున్నారు. రెండునెలల క్రితం బ్రెయిన్‌స్ట్రోక్‌తో హై దరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది ఇటీవల ఇంటికి వచ్చారు. ఆ తర్వాత అనా రోగ్యం బారినపడగా కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతిచెందారు. కాగా, గంగన్న మరో 14 నెలల్లో ఉద్యోగ విరమణ పొందాల్సి ఉంది. ఆయనకు భార్య అన్నపూర్ణ, ముగ్గురు కుమారులు ఉన్నారు.


