విద్యుత్‌షాక్‌తో ఒకరు.. | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌షాక్‌తో ఒకరు..

Jun 13 2026 7:14 AM | Updated on Jun 13 2026 7:14 AM

ముధోల్‌: విద్యుత్‌ షాక్‌తో ఒకరు మృతిచెందిన ట్లు ఎస్సై బిట్లా పెర్సిస్‌ తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని కోలిగల్లీకి చెందిన ముడుగుల సాయినాథ్‌ (40), సాయినాథ్‌ భూమేష్‌ ఎలక్రీషియన్‌తో కలిసి మాధవ్‌నగర్‌ కాలనీలో శుక్రవారం విద్యుత్‌ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో సాయినాథ్‌ ప్రమాదవశాత్తు కరెంటు షాక్‌కు గురయ్యాడు. స్థానికులు అంబులెన్సుకు సమాచారం అందించి ముధోల్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement