పంట రుణం ఇక ఈజీ | - | Sakshi
Sakshi News home page

పంట రుణం ఇక ఈజీ

Jun 13 2026 7:14 AM | Updated on Jun 13 2026 7:14 AM

● అన్నదాతలకు అండగా కృషిక యాప్‌ ● బ్యాంకులకు వెళ్లకుండా పొందే అవకాశం ● అన్నదాతలు ముందుగా తమ మొబైల్‌ ఫోన్‌లో ప్లే స్టోర్‌ నుంచి కృషిక యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. తమ మొబైల్‌ నంబర్‌తో లాగిన్‌ అవ్వాలి. ● ఆధార్‌ నంబర్‌, రైతు పూర్తి పేరు, ఆధార్‌తో అనుసంధానమైన ఫోన్‌ నంబర్‌ నమోదు చేయాలి. దీంతో పాన్‌ కార్డు, పట్టాపాస్‌బుక్‌ వివరాలు కనిపిస్తాయి. ● బ్యాంకు వివరాలను నమోదు చేసి రుణం కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ సమాచారం సంబంధిత బ్యాంకు బ్రాంచికి చేరుతుంది. బ్యాంకు అధికారులు వివరాలను పరిశీలించి రైతుకు రుణం మంజూరు చేస్తారు. ● రైతులు పంట రుణాల కోసం బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ● తమ దరఖాస్తు ఏ దశలో ఉందో కృషిక యాప్‌ ద్వారా నేరుగా తెలుసుకోవచ్చు. ● పంటల సాగు ప్రారంభ సమయంలోనే రుణం లభించడం వల్ల విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ● ఈ యాప్‌ ద్వారా మధ్యవర్తులు లేకపోవడంతో అవినీతికి అవకాశం ఉండదు. ● రైతులు సకాలంలో రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించడం వల్ల వారి సిబిల్‌ స్కోర్‌ మెరుగుపడుతుంది. ● భవిష్యత్తులో పంట రుణాలు, ట్రాక్టర్లు, డ్రోన్లు వంటి వ్యవసాయ పరికరాల కొనుగోలుకు కూడా ఈ యాప్‌ ద్వారా రుణాలు పొందే అవకాశం ఉంటుంది.

లక్ష్మణచాంద: ఇప్పటివరకు సాగు సమయం వచ్చిందంటే చాలు రైతులు విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు అవసరమైన పంట రుణాల కోసం రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. బ్యాంకు అధికారులు ‘రేపు రండి..మాపు రండి’అంటూ తిప్పించుకునేవారు. ఇక నుంచి పంట రుణాలు కావాలనుకునేవారు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. కేవలం మొబైల్‌ యాప్‌ ద్వారా నేరుగా పంట రుణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కృషిక అనే నూతన యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఈ యాప్‌ ఆంగ్లంలో ఉండగా, త్వరలోనే అన్ని ప్రాంతీయ భాషల్లోకి అనువదిస్తామని అధికారులు తెలిపారు.

కృషిక యాప్‌ పని తీరు ఇలా..

ప్రయోజనాలు ఇవే..

భవిష్యత్తు లక్ష్యాలు..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement