జాతీయస్థాయి పోటీల్లో సత్తా | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయి పోటీల్లో సత్తా

Jun 13 2026 7:14 AM | Updated on Jun 13 2026 7:14 AM

ఆదిలాబాద్‌: చండీగఢ్‌లో ఈనెల 10 నుంచి 13 వరకు జరుగుతున్న ‘నేషనల్‌ క్యాడెట్‌ జూడో చాంపియన్‌షిప్‌ 2026’లో ఆదిలాబాద్‌ స్పోర్ట్స్‌ స్కూల్‌ పూర్వవిద్యార్థులు ప్రతిభ కనబర్చారు. జిల్లాకేంద్రంలోని ఆదిత్య జూనియర్‌ కళాశాలలో చదువుతున్న మోథం హర్షవర్ధన్‌ మైనస్‌ 60 కేజీల విభాగంలో స్వర్ణ పతకం, రమావత్‌ తరుణ్‌ మైనస్‌ 55 కేజీల విభాగంలో కాంస్యం కై వసం చేసుకుని రాష్ట్రకీర్తిని జాతీయ స్థాయిలో చాటారు. త్వరలో జరగనున్న ఏషియన్‌ క్యాడెట్‌, వరల్డ్‌ క్యాడెట్‌ జూడో చాంపియన్‌షిప్‌లో వీరు పాల్గొనే అవకాశం ఉందని కోచ్‌ రాజు పేర్కొన్నారు. వీరిద్దరి విజయం జిల్లా క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిస్తోందని డీవైఎస్‌ఓ జక్కుల శ్రీనివాస్‌ తెలిపారు.

లక్ష్మణ్‌కు ఉత్తమ రైతు పురస్కారం

తాంసి: మండలంలోని పొన్నారి గ్రామానికి చెందిన రైతు కేమ లక్ష్మణ్‌ ఉత్తమ రైతు పురస్కారం అందుకున్నారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ అగ్రికల్చర్‌ యూనివర్సిటీ 62వ ఆవిర్భావ వేడుకల్లో రాష్ట్రవ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, అధికారులు రైతును సన్మానించి పురస్కారం అందజేశారు. వ్యవసాయరంగంలో చేసిన విశిష్ట సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది. గ్రామస్తులు ఆయన్ను అభినందించారు. తనకు సహకరించిన ఆదిలాబాద్‌ కృషి విజ్ఞాన కేంద్రానికి కేమ లక్ష్మణ్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement